Mother and Daughter: తల్లీ కూతుళ్ల హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించిన నెల్లూరు కోర్టు

  • 2013లో నెల్లూరు జిల్లాలో జరిగిన దారుణం
  • ఏడేళ్ల తర్వాత నిందితుడికి శిక్ష
  • డబ్బు కోసమే హత్య చేశాడని విచారణలో వెల్లడి

దాదాపుగా ఏడేళ్ల కిందటి హత్య కేసులో దోషికి ఉరిశిక్ష పడింది. తల్లీ కూతుళ్లను హత్య చేసిన కేసులో నిందితుడు ఇంతియాజ్ దోషిగా తేలడంతో నెల్లూరులోని అదనపు సెషన్స్ కోర్టు తీర్పు నిచ్చింది. కేసు వివరాలను పరిశీలిస్తే.. 2013లో నెల్లూరులోని హరనాథపురం రెండో వీధిలో నివాసముంటున్న దినకర్ రెడ్డి భార్య శకుంతల, కుమార్తె భార్గవిలను ఇంతియాజ్ మరో ఇద్దరు మైనర్ బాలురతో కలిసి హత్య చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నగదుకోసమే నిందితులు ఈ ఘోరానికి పాల్పడ్డారని విచారణలో వెల్లడైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగింది. తాజాగా సెషన్స్ కోర్టు ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Mother and Daughter
Murder case
Nellore
convited
Death sentence
session court
verdict
  • Loading...

More Telugu News