Vijay: హీరో విజయ్, ఇతరుల నివాసాల్లో ఐటీ దాడులపై అధికారిక ప్రకటన

  • చెన్నైలో సినీ ప్రముఖుల నివాసాలపై ఐటీ దాడులు
  • హీరో విజయ్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ నివాసాల్లో సోదాలు
  • 38 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామన్న ఐటీ విభాగం

చెన్నైలో నిన్న అగ్రహీరో విజయ్ నివాసంలో ఐటీ దాడులు నిర్వహించడం సంచలనం సృష్టించింది. విజయ్ నివాసంలోనే కాకుండా ఓ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిగాయి. దీనిపై ఐటీ శాఖ అధికారిక ప్రకటన చేసింది. తమిళనాడులో నలుగురు సినీ ప్రముఖులపై దాడులు నిర్వహించామని, వారిలో ఓ అగ్రనటుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ ఉన్నారని పేర్కొంది.

అయితే వీరందరిపై దాడులు నిర్వహించడానికి కారణం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ఓ చిత్రం అని ఆ ప్రకటనలో తెలిపారు. ఆ సినిమా దాదాపు రూ.300 కోట్ల వరకు వసూలు చేసిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొత్తం 38 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, చెన్నై, మధురైల్లో ఈ సోదాలు చేపట్టామని తెలిపారు. సదరు హీరో నివాసంపై దాడులకు కారణం కొన్ని స్థిరాస్తుల్లో ఆ హీరో పెట్టుబడులు, నిర్మాత నుంచి అతను అందుకున్న పారితోషికం విషయంలో స్పష్టత లేకపోవడమేనని వివరించారు. కాగా, ఈ వ్యవహారం అంతటికీ ఇటీవలే విడుదలైన బిగిల్ చిత్రమే కారణమని తెలిసిందే.

  • Loading...

More Telugu News