Pawan Kalyan: పవన్ సీఎం అవుతానని భావించి ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు: ఉండవల్లి

  • పవన్ సినీ రీఎంట్రీపై ఉండవల్లి స్పందన
  • పవన్ సినిమాల్లో నటించడమే కరెక్టన్న ఉండవల్లి
  • మొట్టమొదట కలిసినప్పుడే పవన్ కు ఆ విషయం చెప్పానని వెల్లడి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాన్నాళ్ల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలపై స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి ఆయనను పవన్ కల్యాణ్ సినీ రీఎంట్రీ అంశంపై మాట్లాడాలని కోరారు. అందుకాయన బదులిస్తూ, పవన్ సినిమాల్లో నటించాలని మొట్టమొదట కలిసినప్పుడే చెప్పానని ఉండవల్లి తెలిపారు. వాళ్ల ప్రధాన వృత్తి అదే కాబట్టి సినిమాలు మాత్రం ఆపొద్దని సూచించానని చెప్పారు. అయితే, రాజకీయాలు, సినిమాలు రెండూ కుదరవని పవన్ చెప్పాడని, కానీ ఇప్పుడు కుదురుతోందని అన్నారు.

అప్పట్లో తాను సీఎం అయ్యే అవకాశాలున్నాయని భావించి సినిమాలు వద్దనుకునుంటాడని, ఇప్పుడు నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని నిర్ణయం తీసుకుని ఉంటాడని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేనని, అదే సరైన నిర్ణయంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

జనసేన, బీజేపీల మధ్య పొత్తు గురించి స్పందిస్తూ, పవన్ అధికారంలో లేడు కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఫర్వాలేదని అన్నారు. పొత్తులకు సిద్ధాంతాలతో పనేముందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండొచ్చని, పవన్ కల్యాణ్ పరిస్థితీ పెద్దగా తేడాలేదని అన్నారు.

Pawan Kalyan
Undavalli
Cinema
Tollywood
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News