Dil Raju: 'దిల్' రాజు బ్యానర్లో అనుపమ పరమేశ్వరన్

  • యూత్ లో అనుపమకు మంచి పేరు 
  •  రీసెంట్ హిట్ గా నిలిచిన 'రాక్షసుడు'
  • ఆశిష్ జోడీగా కనిపించనున్న అనుపమ

తెలుగులో ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. ఆరంభంలో విజయాలు పలకరించినా, ఆ తరువాత పరాజయాలు క్యూ కట్టాయి. ఫలితంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల 'రాక్షసుడు' వంటి సక్సెస్ ను ఆమె అందుకున్నప్పటికీ అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి 'దిల్' రాజు బ్యానర్లో చేసే అదృష్టాన్ని ఆమె దక్కించుకుంది.

గతంలో 'దిల్'రాజు బ్యానర్లో 'శతమానం భవతి' చేసిన అనుపమ, మరోసారి ఆయన బ్యానర్లో చేయనుంది. 'దిల్' రాజు తన తమ్ముడు శిరీష్ రెడ్డి తనయుడైన ఆశిష్ ను హీరోగా పరిచయం చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలను ఆయన పూర్తి చేశాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుపమను తీసుకున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. దర్శకుడు ఎవరనే విషయాన్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు .. త్వరలో రివీల్ చేస్తారట.

Dil Raju
Ashish
Anupama Parameswaran
  • Loading...

More Telugu News