Prathipati Pulla Rao: 'కియా తరలింపు'పై సీఎం జగన్ సమాధానం చెప్పాలి: ప్రత్తిపాటి పుల్లారావు

  • అమరావతి రైతుల దీక్షకు ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు సంఘీభావం
  • కియా పరిశ్రమను తరలిస్తున్నారన్న ప్రచారంపై స్పందన 
  • వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని విమర్శ 

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ప్లాంటును తమిళనాడుకు తరలించే అవకాశం ఉందని రాయిటర్స్ ప్రచురించిన కథనం పట్ల టీడీపీ నేతలు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో రైతుల ఆందోళనకు మద్దతు తెలపడానికి వచ్చిన టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు కియా తరలింపుపై స్పందించారు.

కియా పరిశ్రమను అనంతపురం నుంచి వేరే రాష్ట్రానికి ఎందుకు తరలిస్తున్నారన్న విషయంపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని రైతులు ఇన్ని రోజులుగా చేస్తోన్న ఆందోళనను జగన్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆయన విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని నక్కా ఆనంద బాబు విమర్శించారు. కియా వంటి పరిశ్రమలు తరలిపోవడం రాష్ట్రానికి నష్టమని చెప్పారు. 

Prathipati Pulla Rao
nakka anandababu
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
Anantapur District
  • Loading...

More Telugu News