Pavan kalyan: పవన్ సినిమాకి 'వకీల్ సాబ్' టైటిల్?

  • పవన్ హీరోగా 'పింక్' రీమేక్ 
  • ఉగాది రోజున టైటిల్ ప్రకటన 
  •  మే 15వ తేదీన సినిమా విడుదల  

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. కొంతకాలం క్రితం హిందీలో వచ్చిన 'పింక్' సినిమాకి ఇది రీమేక్. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత పవన్ చేస్తున్న సినిమా ఇది. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

కథాపరంగా ఈ సినిమాకి ముందుగా 'లాయర్ సాబ్' అనే టైటిల్ ను అనుకున్నారు. ఆ తరువాత 'వకీల్ సాబ్' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. రీసెంట్ గా ఈ టైటిల్ నే ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. దాదాపు ఈ టైటిల్ ఖరారైపోయినట్టేనని అంటున్నారు. 'ఉగాది' రోజున ఈ టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. మే 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గతంలో 'గబ్బర్ సింగ్' మే నెలలోనే విడుదలై సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Pavan kalyan
Dil Raju
Venu Sri Ram
Pink Remake
  • Loading...

More Telugu News