Ayodhya Ram Mandir: రామమందిర నిర్మాణానికి మొదలైన విరాళాల సేకరణ.. కేంద్రం విరాళం ఒక్క రూపాయి!

  • అన్ని వర్గాలు ఉదారంగా ఆదుకోవాలని వినతి
  • నగదు, ఆస్తుల రూపంలో ఇచ్చినా స్వీకరణ
  • ఎటువంటి షరతులూ ఉండవని స్పష్టం

అయోధ్యలో తలపెట్టిన రామమందిరం నిర్మాణానికి ఇచ్చే విరాళాలకు ఎటువంటి షరతులు వర్తించవని, అందువల్ల ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ట్రస్ట్‌ సభ్యులు కోరారు. వివాదాస్పద భూమిపై రామ్ లల్లాకే అధికారం దఖలు పరిచిన సుప్రీంకోర్టు స్వతంత్ర ట్రస్ట్‌ ఏర్పాటుచేసి దాని ఆధ్వర్యంలో మందిర నిర్మాణం చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ టస్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు నిన్న పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటించారు.

దీంతో ఈ ట్రస్టుకు కేంద్ర ప్రభుత్వం రూపాయి విరాళంగా అందించి బోణీ కొట్టింది. ఈ విరాళాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము ప్రభుత్వం తరపున ట్రస్ట్‌ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ సభ్యులు మాట్లాడుతూ నగదు, ఆస్తుల రూపంలో ఎలా ఇచ్చినా విరాళాలు స్వీకరించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ట్రస్టు కార్యాలయం మాజీ అటార్నీ జనరల్‌ పరాశరన్‌ ఇంటి కేంద్రంగా కొనసాగుతోందని, త్వరలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
donations
  • Loading...

More Telugu News