budda venkanna: ఢిల్లీలో కనపడిన వారందరి కాళ్లు పట్టుకుంటున్నారట కదా?: విజయసాయికి బుద్ధా వెంకన్న కౌంటర్

  • బీజేపీ సైతం తుగ్లక్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఛీ కొట్టింది
  • రాజధానిగా అమరావతి నోటిఫై కాలేదు అంటూ వైసీపీ నేతలు అరిచారు
  • నోటిఫై అయ్యింది అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది
  • జగన్ గారి మైండ్ బ్లాంక్ అయ్యింది  

ఏపీ రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

'కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం తుగ్లక్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఛీ కొట్టడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఢిల్లీలో కనపడిన అందరి కాళ్లు పట్టుకుంటున్నారట కదా, విజయసాయిరెడ్డి?' అని ప్రశ్నించారు.

'రాజధానిగా అమరావతి నోటిఫై కాలేదు అంటూ అరిచారు. కేంద్రం 23.04.2015 నే అమరావతి రాజధానిగా నోటిఫై అయ్యింది అని క్లారిటీ ఇవ్వడంతో జగన్ గారి మైండ్ బ్లాంక్ అయ్యింది. రాజధానిని తరలించడానికి ఇంకా ఏమైనా అడ్డదారులు ఉన్నాయా? అని వెతుక్కునే పనిలో పడ్డారు విధ్వంసకారుడు జగన్ గారు' అని ట్వీట్ చేశారు.

'తప్పుడు లెక్కలు రాసే మీరే ఈ లాజిక్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పాలి. జగన్ గారికి, మీకు డబ్బు పిచ్చి పోగొట్టేలా మనీ డీ-అడిక్షన్ సెంటర్లు పెట్టించుకోండి కాస్త ఉపయోగం ఉంటుంది' అని బుద్ధా వెంకన్న విమర్శించారు. 

budda venkanna
Telugudesam
Amaravati
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News