Degree college: అశ్లీల పోస్టర్లతో ప్రచారం కేసులో.. దర్శకుడు నర్సింహనంది, నిర్మాత శ్రీనివాసరావు అరెస్ట్
- '1940లో ఒక గ్రామం' చిత్రానికి జాతీయ అవార్డు
- తాజాగా 'డిగ్రీకాలేజీ' పేరుతో సినిమా
- అమీర్ పేట చౌరస్తాలో అశ్లీల పోస్టర్లతో ప్రచారం
గతంలో '1940లో ఒక గ్రామం' చిత్రం ద్వారా జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్న టాలీవుడ్ దర్శకుడు నర్సింహనంది, నిర్మాత శ్రీనివాసరావును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నర్సింహనంది దర్శకత్వంలో శ్రీలక్ష్మీనరసింహ సినిమా బ్యానర్‌పై ‘డిగ్రీ కాలేజ్’ అనే సినిమాను రూపొందించారు. వరుణ్, శ్రీదివ్య, దువ్వాసి మోహన్, జయవాణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా అశ్లీలంగా, అసభ్యకరంగా ఉన్న పోస్టర్లను అతికించారు. అమీర్‌పేట చౌరస్తా సమీపంలో అసహ్యంగా ఉన్న ఈ పోస్టర్లను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదుతో దర్శక, నిర్మాతలు నర్సింహనంది, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు.