Hajipur: రేపు హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పు... అందరిలోనూ ఉత్కంఠ!

  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యలు
  • పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు వెల్లడి
  • నిందితుడిపై పక్కా సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసులు
  • ఉరిశిక్ష విధించాలంటున్న బాధితుల కుటుంబాలు

నల్గొండ జిల్లా హాజీపూర్ లో ఓ పాడుబడిన బావిలో, ఆ చుట్టుపక్కల అమ్మాయిల మృతదేహాలు లభ్యం కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో శ్రీనివాస్ అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నివ్వెరపరిచే సంగతులు వెల్లడయ్యాయి. ఇప్పుడా కేసులో రేపు తీర్పు వెలువడనుంది. నల్గొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు తీర్పు ఇవ్వనుంది.

ఈ కేసులో రాచకొండ పోలీసులు పక్కా సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. అటు, ప్రాసిక్యూషన్ కూడా నిందితుడికి ఉరిశిక్ష విధించాలని వాదించింది. బాధిత కుటుంబాలు కూడా నిందితుడు శ్రీనివాస్ కు ఉరిశిక్ష విధించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో, రేపు వెల్లడయ్యే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News