RRR: వాయిదా పడిన 'ఆర్ఆర్ఆర్' విడుదల... కొత్త డేట్ ప్రకటించిన యూనిట్

  • 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదల వచ్చే ఏడాది
  • 2021 జనవరి 8న రిలీజవుతుందని వెల్లడించిన చిత్రబృందం
  • ఈ ఏడాది జూలై 30న వస్తుందని గతంలో ప్రకటన
  • ఇప్పుడా నిర్ణయం వాయిదా

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. తాజాగా ఈ చిత్రబృందం నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. చిత్ర విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు తెలిపిన 'ఆర్ఆర్ఆర్' యూనిట్, మరో ట్వీట్ లో కొత్త తేదీని ప్రకటించింది.

వాస్తవానికి 'ఆర్ఆర్ఆర్' చిత్రం 2020 జూలై 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, వచ్చే ఏడాది జనవరి 8న తమ చిత్రం విడుదల అవుతుందని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంత సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండడం కష్టమే అయినా, ఎప్పటికప్పుడు చిత్ర సంగతులు పంచుకుంటామని ఓ ట్వీట్ లో తెలిపింది. అత్యుత్తమ స్థాయిలో సినిమా రూపొందించాలంటే సమయం పడుతుందని, అభిమానుల నిరాశను తాము అర్థం చేసుకోగలమని చిత్రబృందం పేర్కొంది.

RRR
Release Date
2021 Jan 8
Rajamouli
Ramcharan
Junior NTR
  • Loading...

More Telugu News