Rajinikanth: రజనీ ఓ కీలుబొమ్మ... వాళ్లు రాసిన స్క్రిప్టును చిలకలా పలుకుతున్నారు: కార్తీ చిదంబరం

  • సీఏఏకు మద్దతు పలికిన రజనీకాంత్
  • ఘాటుగా స్పందించిన కార్తీ చిదంబరం
  • రజనీ నటన ఆపి బీజేపీలో చేరితే సరి అంటూ వ్యంగ్యం

కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలుకుతూ, దీనివల్ల దేశంలోని ఏ ఒక్కరూ కోల్పోయేది ఏమీ ఉండదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే రజనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఘాటుగా స్పందించారు. రజనీకాంత్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని, వాళ్లు రాసిచ్చిన స్క్రిప్టును చిలకలా పలుకుతున్నాడని విమర్శించారు. రజనీకాంత్ ఇక నటించడం ఆపేసి బీజేపీలో చేరితే మంచిదని వ్యంగ్యం ప్రదర్శించారు. సొంత పార్టీ స్థాపించేందుకు మీనమేషాలు లెక్కిస్తూ, కారణాలు చెప్పలేక అభినయాలు చేస్తున్న రజనీ ఇక బీజేపీలో చేరొచ్చని సెటైర్ వేశారు.

Rajinikanth
Karthi Chidambaram
BJP
Congress
Tamilnadu
  • Loading...

More Telugu News