Amit Shah: అయోధ్య ట్రస్టులో దళిత వర్గానికి ప్రాతినిధ్యం: అమిత్ షా

  • ట్రస్టులో మొత్తం 15 మంది ట్రస్టీలు ఉంటారు
  • మొత్తం 67 ఎకరాల స్థలాన్ని ట్రస్టుకు అప్పగిస్తాం
  • నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను ట్రస్టే తీసుకుంటుంది

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ ఈరోజు లోక్ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, అయోధ్య ట్రస్టులో దళిత సామాజికవర్గానికి చెందిన ఒక వ్యక్తికి కూడా చోటు కల్పించినట్టు తెలిపారు.

ట్రస్టులో మొత్తం 15 మంది ట్రస్టీలు ఉంటారని అమిత్ షా చెప్పారు. సామాజిక సామరస్యాన్ని పెంపొందించేందుకు ట్రస్టులో దళిత వర్గానికి చెందిన ఒకరికి ఎల్లప్పుడూ ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. ఈమేరకు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 67 ఎకరాల స్థలాన్ని ట్రస్టుకు అప్పగిస్తామని... ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ట్రస్టు తీసుకుంటుందని చెప్పారు.

Amit Shah
Narendra Modi
BJP
Ayodhya Temple Trust
  • Loading...

More Telugu News