Kajal Agarwal: కాజల్ మైనపు బొమ్మ ఆవిష్కరణ.. పక్కన నిలబడి సేమ్ పోజిచ్చిన ముద్దుగుమ్మ.. ఫొటోలు వైరల్

  • సింగపూర్‌ వెళ్లిన కాజల్‌
  • కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు
  • ఇప్పటికే ఈ మ్యూజియంలో మహేశ్, ప్రభాస్ మైనపు బొమ్మలు

సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరోయిన్‌ కాజల్ అగర్వాల్  మైనపు విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు. ఇప్పటికే సింగపూర్ వెళ్లిన కాజల్ తన మైనపు బొమ్మ పక్కన నిలబడి ఫొటో దిగింది. మైనపు బొమ్మ ఏదో, నిజమైన కాజల్ ఎవరో గుర్తు పట్టాలంటే కష్టమే.
                                    
ఎరుపు రంగు దుస్తుల్లో చేతిలో మైక్‌ పట్టుకుని కాజల్ తన బొమ్మ పక్కన నిలబడింది. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి కాజల్ తన మైనపు బొమ్మతో ఫొటోలు దిగింది. కాగా, ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు సినీనటులు మహేశ్ బాబు, ప్రభాస్ విగ్రహాలు ఉన్నాయి. బాలీవుడ్‌ నటుల్లో అమితాబ్, హృతిక్, కాజోల్ వంటి పలువురి బొమ్మలు ఉన్నాయి.
         

Kajal Agarwal
Tollywood
singapore
  • Loading...

More Telugu News