Varun Tej: బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి.. అయితే అతనితో కలసి పనిచేయాలని ఉంది: వరుణ్ తేజ్

  • షారుఖ్ ఖాన్ కు నేను పెద్ద ఫ్యాన్
  • ఆయనతో కలిసి పని చేయాలని ఉంది
  • ఏ భాషలో నటించడానికైనా నేను సిద్ధమే

తాను షారుఖ్ ఖాన్ కు పెద్ద ఫ్యాన్ అని టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ తెలిపాడు. ఒకసారి రామ్ చరణ్ ఇంటికి షారుఖ్ వచ్చారని... ఆయనను తాను దూరం నుంచి చూస్తూ ఉండిపోయానని చెప్పాడు. ఆయనతో కాఫీ తాగుతూ ముచ్చటించాలనేది తన కోరిక అని అన్నాడు. షారుఖ్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని... ఆయనతో పని చేయాలని కూడా ఉందని చెప్పాడు. షారుఖ్ తో కలిసి పనిచేయాలని ఎవరికుండదు? అని ప్రశ్నించాడు.

తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని... కానీ కథ నచ్చక కొన్ని, షెడ్యూల్ సహకరించక మరికొన్ని చిత్రాలను తిరస్కరించానని వరుణ్ తేజ్ చెప్పాడు. కథలో సత్తా ఉంటే ఏ భాషలో నటించడానికైనా తాను సిద్ధమేనని తెలిపాడు. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉందని అన్నాడు. సినిమాలకు భాష, ప్రాంతీయ భేదాలు అడ్డురావనే విషయం 'బాహుబలి'తో రుజువయిందని చెప్పాడు.

Varun Tej
Shahrukh Khan
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News