Pavan Kalyan: పవన్ కల్యాణ్ కోసం కథ రెడీ చేయనున్న త్రివిక్రమ్

  • పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండు హిట్లు 
  •  పరాజయాన్ని చవిచూసిన 'అజ్ఞాతవాసి'
  • వచ్చే ఏడాది మరో సినిమా చేసే ఆలోచన  

పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా, వాటిలో రెండు భారీ విజయాలను అందుకున్నాయి. ఒక్క 'అజ్ఞాతవాసి' మాత్రమే పరాజయాన్ని మూటగట్టుకుంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే అందుకు చాలానే సమయం వుంది.

పవన్ తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ సినిమాలు చేయడానికి ముందుకు రావడంతో, ఆయనను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఇప్పటికే మూడు ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి. మరోపక్క, పవన్ తో మరో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడు. ఆయనతో చేయడానికి పవన్ కూడా అంతే ఆసక్తిని చూపుతున్నాడు. పవన్ కోసం త్రివిక్రమ్ మంచి కథను సిద్ధం చేయనున్నాడట. వచ్చే ఏడాదిలో ఈ ఇద్దరూ సెట్స్ పైకి వెళ్లొచ్చునని చెప్పుకుంటున్నారు.

Pavan Kalyan
Trivikram Srinivas
Tollywood
  • Loading...

More Telugu News