Nirbhaya: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు స్టేపై నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు.. సర్వత్ర ఉత్కంఠ!

  • పెండింగులో దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు
  • తేలే వరకు ఉరి వద్దన్న పాటియాలా హౌస్ కోర్టు 
  • హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం, ఢిల్లీ సర్కారు

‘నిర్భయ’ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉండడం వల్ల ఉరిశిక్ష అమలుపై పాటియాలా హౌస్‌కోర్టు గత నెల 31న స్టే విధించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు రెండూ ఈ స్టేను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి.

కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై శని, ఆదివారాల్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 2న తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తం మరోమారు కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దోషుల ఉరిశిక్ష అమలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఎటువంటి తీర్పు వస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News