Cannor: మండపంపైకి వస్తూ పెళ్లి కూతురు కిర్రాక్ డ్యాన్స్.. వీడియో వైరల్!

  • కేరళలోని కన్నూరులో ఘటన
  • కాబోయే శ్రీవారిని ఆశ్చర్యపరిచిన వధువు
  • పెళ్లి కుమార్తె డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

పెళ్లి మండపంలోకి వస్తూ ఓ వధువు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మండపంలో అడుగుపెడుతూనే తన బృందంతో కలిసి అదరగొట్టేసింది. వరుడు సహా పెళ్లికి హాజరైన వారు ఆమె డ్యాన్స్‌కు మైమరిచిపోయారు. కేరళలోని కన్నూరులో జరిగిందీ ఘటన. కాబోయే శ్రీవారిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలని ముందే నిర్ణయించుకున్న వధువు.. తన బృందంతో కలిసి ‘మలైమారు’ అనే పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

సాధారణంగా వధువు సిగ్గుల మొగ్గలై పెళ్లి మండపంపైకి చేరుకోవడం చూస్తుంటాం. అలాంటిది ఎలాంటి బెరుకూ లేకుండా పెళ్లికి హాజరైన అతిథుల ముందే ఫుల్ ఎనర్జీతో ఆమె చేసిన డ్యాన్స్ అందరినీ ఆకర్షించింది. పెళ్లికి హాజరైన వారిలో ఒకరు ఆమె డ్యాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయింది. ఆమె డ్యాన్స్‌కు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. దీనిని మీరూ చూసేయండి మరి!

Cannor
Kerala
bride
dance
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News