GVL Narasimha Rao: రాజధానిపై కొంతమంది ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • రాజధాని విషయమై జోక్యం చేసుకోమని కేంద్రం  చెప్పింది
  • అయినా ప్రతిపక్ష నేతలు అమాయక వ్యాఖ్యలు చేస్తున్నారు  
  • కేంద్రం వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడొద్దు

రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొంత మంది ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు వింటుంటే తనకు ఆశ్చర్యం కలుగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రకటనలను, జవాబులను ఈవిధంగా వక్రీకరించడం తగదని హితవు పలికారు.

రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని అనేక సందర్భాల్లో తాను చెప్పానని అన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని, అది మారడానికి వీల్లేదని కేంద్రం నిర్ణయించినట్టుగా ప్రతిపక్ష నేతలు చెబుతుండటాన్ని అమాయక వ్యాఖ్యలో, మోసపూరిత వ్యాఖ్యలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాజధాని అంశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ప్రతిపక్ష నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

GVL Narasimha Rao
BJP
Amaravati
capital
  • Loading...

More Telugu News