Devineni Uma: అమరావతిపై రాష్ట్ర పరిధిలో నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది: దేవినేని ఉమ

  • రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలో నిర్ణయమన్న కేంద్రం
  • అది ముగిసిన అధ్యాయమన్న ఉమ
  • అమరావతిని కేంద్రం ఎప్పుడో నోటిఫై చేసిందని వెల్లడి

రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయం అని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ స్పందించారు. ఏపీ రాజధాని అమరావతేనని రాష్ట్ర పరిధిలో నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని, అది ముగిసిన అధ్యాయం అని వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నోటిఫై చేసిందని, భారతదేశ పటంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించారని స్పష్టం చేశారు. ఇవాళ లోక్ సభలో టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇవ్వడం తెలిసిందే. అందులోనే రాజధానిపై వ్యాఖ్యలు చేశారు.

Devineni Uma
Amaravati
Andhra Pradesh
AP Capital
NDA
Lok Sabha
  • Loading...

More Telugu News