Under-19 Worldcup: అండర్-19 వరల్డ్ కప్: పాక్ తో సెమీస్ లో టీమిండియాకు శుభారంభం

  • టీమిండియా టార్గెట్ 173 పరుగులు
  • 16 ఓవర్లలో 65 పరుగులు చేసిన ఓపెనర్లు
  • భారత్ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు పాక్ విఫలయత్నాలు

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ లక్ష్యం దిశగా సాగిపోతోంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కు ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (27 బ్యాటింగ్), దివ్యాంశ్ సక్సేనాగ్ (31 బ్యాటింగ్) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు అజేయంగా 16 ఓవర్లలో 65 పరుగులు జోడించారు. ఈ జోడీని విడదీసేందుకు పాక్ బౌలర్లు చెమటోడ్చుతున్నారు. అంతకుముందు, టీమిండియా బౌలర్ల ధాటికి పాక్ 43.1 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచినా సద్వినియోగం చేసుకోలేకపోయిన పాక్ ఇప్పుడు భారత ఓపెనర్ల పట్టుదలతో మ్యాచ్ పై దాదాపుగా ఆశలు వదిలేసుకుంది. టీమిండియా కుర్రాళ్ల విజయానికి ఇంకా 34 ఓవర్లలో 108 పరుగులు కావాలి.

Under-19 Worldcup
India
Pakistan
South Africa
  • Loading...

More Telugu News