Most Eligible Bachelor: ఈ నెల 8న.. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ఫస్ట్ స్టెప్

  • అఖిల్ సరసన నటిస్తున్న పూజా హెగ్డే
  • బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
  • గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమా

అఖిల్ అక్కినేని నటిస్తోన్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్’ మూవీ ఫస్ట్ లుక్ సిద్ధమైంది. ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించిన అఖిల్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ ను అందుకోలేకపోయాడు. తాజా చిత్రంతో ఈ సారైనా హిట్ సాధించాలని అఖిల్ పట్టుదలతో ఉన్నాడు. ఈ నెల 8న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్’ ఫస్ట్ స్టెప్ తో ప్రేక్షకులముందుకు రానున్నట్లు అఖిల్  ట్విట్టర్ మాధ్యమంగా వెల్లడించాడు.

ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్ని వాసువర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు.

Most Eligible Bachelor
First look
On Feb 8th
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News