Raghunandan Rao: ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటీ నిజం కాదు: బీజేపీ నేత రఘునందన్

  • బీజేపీ నేత రఘునందన్ పై తీవ్ర ఆరోపణలు
  • అత్యాచారం చేశాడన్న మెదక్ జిల్లా మహిళ
  • ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియడంలేదన్న రఘునందన్
  • ఆ మహిళ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని వెల్లడి

బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడం తెలిసిందే. మెదక్ జిల్లాకు చెందిన రాధారమణి అనే మహిళ రఘునందన్ పై అత్యాచార ఆరోపణలు చేసింది. 2007 నుంచి రఘునందన్ తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని వెల్లడించింది. దీనిపై ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, తనపై వస్తున్న ఆరోపణల పట్ల రఘునందన్ స్పందించారు. ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నూటికి నూరు శాతం అవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఈ అంశంలో తనమీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మరోసారి వివరణ ఇస్తానని వెల్లడించారు. అంతేకాదు, తనకు ఈ వ్యవహారంలో ఎవరూ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Raghunandan Rao
BJP
Telangana
Medak District
Woman
  • Loading...

More Telugu News