Jagdish Reddy: మన సంక్షేమ పథకాలవైపు ప్రపంచదేశాలు చూస్తున్నాయి: మంత్రి జగదీశ్ రెడ్డి

  • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల అడ్రస్ లు గల్లంతయ్యాయి 
  • దేశ రాజకీయ చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ రికార్డు సృష్టించింది
  • సహకార సంఘాల ఎన్నికల ఏకగ్రీవం కోసం కృషిచేయాలి

దేశ రాజకీయ చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ సృష్టించిన రికార్డులను ఎవరూ కూడా అధిగమించలేరని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు సూర్యాపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో మంత్రి భేటీ అయ్యారు. త్వరలో జరుగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

సహకార ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు నాయకులు కృషి చేయాలని మంత్రి కోరారు. కులం అనేది ఆధారం కావాలే తప్ప వ్యతిరేకం కాకూడదని చెప్పారు. పరిధులు మీరితే ఎంతటివారయినా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలవైపు ప్రపంచదేశాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అడ్రస్ లు గల్లంతయ్యాయన్నారు.

Jagdish Reddy
Minister
Telangana
Co operative socities
Elelctions
  • Loading...

More Telugu News