Jagan: సీఎం జగన్ తో ముగిసిన రాజధాని రైతుల చర్చలు
- తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చర్చ
- ఎమ్మెల్యేలు ఆళ్ల, శ్రీదేవి సమక్షంలో రైతులతో మాట్లాడిన జగన్
- దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన చర్చ
ఏపీ సీఎం జగన్ ని రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో రైతులు చర్చలు జరిపారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవి ఆధ్వర్యంలో రైతులతో ఈ చర్చలు జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు.
తాను ఉండవల్లి రైతు బిడ్డను అని, ప్లీడర్ గా ప్రాక్టీస్ చేస్తున్నానని మహిళ నిర్మల అన్నారు. రెండున్నర గంటలసేపు తమతో సీఎం చర్చలు జరిపారని, ప్రతి రైతుతో ఆయన మాట్లాడారని, రైతు సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని, తమ పొలాలు తమకు మిగిలేలా చూడాలని విన్నవించుకున్నామని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.
నిడమర్రు గ్రామానికి చెందిన వ్యవసాయకూలీ నాగరాజు మాట్లాడుతూ, తమ ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అడిగేందుకు ఆయన్ని కలిశామని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.