Amaravati: కేంద్ర మంత్రి గెహ్లాట్ ను కలిసిన అమరావతి రైతులు

  • ఢిల్లీలో కొనసాగుతున్న రైతులు, జేఏసీ నేతల పర్యటన
  • అమరావతిలో నెలకొన్న పరిస్థితులపై మంత్రికి వివరణ
  • పునర్విభజన చట్టంలోని రాజధాని అంశంపై ప్రస్తావన

ఢిల్లీలో నాల్గో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ ను అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఇవాళ కలిశారు. ఏపీ రాజధానిలో నెలకొన్న పరిస్థితులు, రైతుల ఆందోళనలు, పోలీసుల తీరును ఆయనకు జేఏసీ నేతలు వివరించారు.

అనంతరం మీడియాతో జేఏసీ నేతలు మాట్లాడుతూ, అమరావతిని రాజధానిగా ఎందుకు కొనసాగించాలన్న విషయాన్ని మంత్రికి వివరించామని, ఆర్థిక అంశాలు, పునర్విభజన చట్టంలో రాజధాని గురించి ఉన్న అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు.

కాగా, రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్ మెంట్లు లభిస్తే వారిని అమరావతి రైతులు, జేఏసీ నేతలు కలిసే అవకాశాలు ఉన్నాయి. రాజధాని విషయమై జోక్యం చేసుకోవాలని కోరనున్నట్టు సమాచారం.

Amaravati
Farmers
JAC
Minister
Gehlat
  • Loading...

More Telugu News