secial Deputy collector: శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు!
![](https://imgd.ap7am.com/thumbnail/tn-062abb252daa.jpg)
- స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యంపై అవినీతి ఆరోపణలు
- ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు
- అనంతపురం, కర్నూలులోని నివాసాల్లో ఏకకాలంలో సోదాలు
శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సత్యంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏకకాలంలో అనంతపురం, కర్నూలులోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.3 కోట్ల మేర విలువైన ఆస్తులను గుర్తించారు.