Lakshman: బీడీ కట్టలపై పుర్రెగుర్తు తప్ప కేసీఆర్ సాధించిందేమీ లేదు: లక్ష్మణ్

  • తెలంగాణకు బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదన్న కేటీఆర్
  • దీటుగా స్పందించిన లక్ష్మణ్
  • మీ జేబులు నింపుకోవడానికి కేంద్రం నిధులు ఇవ్వదని వ్యాఖ్యలు
  • బడ్జెట్ లో రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు ఉండదని హితవు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ టీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటికంటే, గత ఆరు సంవత్సరాల్లో కేంద్రం ఏడు రెట్ల నిధులు ఇచ్చిందని వెల్లడించారు. నిజాయతీ ఉంటే దీనిపై కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీడీకట్టలపై పుర్రెగుర్తు తప్ప కేంద్రమంత్రిగా కేసీఆర్ సాధించిందేమీలేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణకు కేంద్రం బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండవన్న సంగతి కేటీఆర్ గుర్తించాలని హితవు పలికారు. మీ జేబులు నింపుకోవడానికి కేంద్రం నిధులు కేటాయించదన్న విషయాన్ని గ్రహించాలని కేటీఆర్ పై ధ్వజమెత్తారు. కేటీఆర్ గల్లీ మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

Lakshman
BJP
KTR
TRS
KCR
Telangana
Union Budget 2020
  • Loading...

More Telugu News