Varla Ramaiah: ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఎంతో దుస్థితిలో ఉన్నారు: వర్ల రామయ్య

  • సీఎస్ పదవికి దూరమైన ఎల్వీ సుబ్రహ్మణ్యం
  • బాపట్ల మానవ వనరుల సంస్థ డీజీగా బాధ్యతలు
  • ఎల్వీ గురించి ఓ మీడియా సమావేశంలో ప్రస్తావించిన వర్ల రామయ్య
  • ఎల్వీ ఒకే ఒక అటెండర్ సాయంతో విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడి

వైసీపీ ప్రభుత్వ ఆగ్రహానికి గురై సీఎస్ పదవికి దూరమైన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రస్తుతం బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఓ మీడియా సమావేశంలో ఎల్వీ ప్రస్తావన తీసుకువచ్చారు. రాష్ట్రంలో అధికారులను తనతో పాటు జైలుకు తీసుకెళ్లే అలవాటు జగన్ సొంతమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా ఆయన, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడో జగన్ చెప్పాలని నిలదీశారు. ఎల్వీ ప్రస్తుతం ఎంతో దుస్థితిలో ఉన్నారని, ఆయన ఒకే ఒక్క అటెండర్ సాయంతో విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఎల్వీ పరిస్థితిని ప్రజలు గమనించాలని సూచించారు. అసలు, ఎల్వీ పట్ల ఎందుకు అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

Varla Ramaiah
LV Subrahmanyam
Ex CS
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News