Kajal Agarwal: 'టుస్సాడ్స్'లో కాజల్ మైనపు బొమ్మ రెడీ.. తెగ సంబరపడిపోతున్న ముద్దుగుమ్మ!

  • రేపు మైనపు బొమ్మ ఆవిష్కరణ 
  • సింగపూర్ చేరుకున్న కాజల్
  • తన భావాలతో వీడియో పోస్ట్ చేసిన అందాలతార

అందాల కథానాయిక కాజల్ అగర్వాల్ అమితానందం వ్యక్తం చేస్తోంది. సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహం ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని కాజల్ తెగ సంబరపడిపోతూ వీడియో పోస్ట్ చేసింది.

రేపు  టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాజల్ అక్కడికి వెళ్లింది. కాగా, కాజల్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపుదిద్దుకుంటోన్న ఓ సినిమాతో పాటు, కమలహాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లోనూ నటిస్తోంది.                                                   

Kajal Agarwal
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News