Somireddy Chandra Mohan Reddy: 'ఇలాంటి వారిని సమాజం నుంచే వెలివేయాలి'.. బీజేపీ ఎంపీపై సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • గాంధీపై బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
  • దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు గాంధీ
  • గాంధీని కించపరచడమంటే దేశస్థాయిని తగ్గించుకోవడమే

మహాత్మా గాంధీ వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు పదే పదే చెబుతారని, అయితే సత్యాగ్రహాల వల్ల బ్రిటిష్‌వారు దేశాన్ని వదిలిపోలేదని, వారు విసిగిపోయి మనకు స్వాతంత్ర్యం ఇచ్చారని బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డే నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. గాంధీజీ సహా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నేతలెవరూ పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినలేదని.. వారిదంతా ఓ డ్రామా అని ఆయన అన్నారు. గాంధీ లాంటివారు ఈ దేశంలో మహాత్ములైపోయారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పందిస్తూ.. 'శాంతి, అహింసకు ప్రపంచానికే రోల్ మోడల్ మహాత్మాగాంధీ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు. ప్రపంచస్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చినాయనను కించపరచడమంటే దేశస్థాయిని తగ్గించుకోవడమే. గాంధీని అవమానించేలా మాట్లాడిన వారిని పార్టీల నుంచే కాదు సమాజం నుంచే వెలివేయాలి' అని ట్వీట్ చేశారు.

Somireddy Chandra Mohan Reddy
Telugudesam
BJP
  • Loading...

More Telugu News