Visakhapatnam: విశాఖలో ల్యాండ్ పూలింగ్ కు అంగీకరించం: టీడీపీ నేత బండారు

  • ఇక్కడి భూముల పై కన్నేసే రాజధాని తరలింపు 
  • నాడు వైఎస్సార్ బాటలోనే నేడు కొడుకు జగన్
  • ప్రభుత్వ చర్యలు అడ్డుకుంటామని ప్రకటన

అధికారంలో ఉండగా వైఎస్సార్ విశాఖలోని భూములు అమ్మి హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు జగన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయమూర్తి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విశాఖను రాజధానిగా చేయాలన్న జగన్ ప్రయత్నం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కాదని, భూములు కొల్లగొట్టే తాపత్రయమన్నారు. విశాఖ భూములు అమ్మి జగన్ నవరత్నాలు అమలు చేస్తారా? అని ప్రశ్నించారు.

ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇక్కడి రైతుల భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. తాను ముదపాకలో భూములు దోచుకున్నానని చేస్తున్న ఆరోపణలను నిరూపించగలరా? అని బండారు సవాల్ విసిరారు. శారదాపీఠంలో మూడు గంటలు గడిపేందుకు సమయం ఉన్న జగన్ కు, విశాఖ సమస్యలపై చర్చించేందుకు సమయం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

Visakhapatnam
landpooling
bandaru sathynarayanmurty
jagan
  • Loading...

More Telugu News