Gottimukkala Padma Rao: సీనియర్ వంశీ ఎవరిలోనూ కలవడు .. అదే ఆయన మైనస్: నిర్మాత గొట్టిముక్కల పద్మారావు

  • వంశీతో రెండు సినిమాలు చేశాను 
  • అన్ని విభాగాలపై ఆయనకి పట్టుంది
  • వంశీ తత్వమే అంత అని చెప్పిన గొట్టిముక్కల    

సీనియర్ వంశీ దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన చిత్రాలలో 'ఏప్రిల్ 1 విడుదల' ఒకటి. రాజేంద్రప్రసాద్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. అలాంటి ఈ సినిమాకి గొట్టిముక్కల పద్మారావు నిర్మాతగా వ్యవహరించారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "వంశీగారి దర్శకత్వంలో 'ఏప్రిల్ 1 విడుదల' .. 'జోకర్' సినిమాలు నిర్మించాను. వంశీ గారికి కథాకథనాలపైనే కాదు, సాంకేతికపరమైన విషయాల పైన కూడా మంచి అవగాహన వుంది. ఆయనలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా వున్నాడు. అయితే ఎటొచ్చీ, ఆయన ఎవరిలోనూ కలవడు .. ఎవరితో ఏ విషయాన్ని షేర్ చేసుకోడు. చాలా రిజర్వ్డ్ గా ఉంటూ తన పని తను చేసుకుపోతుంటాడు. నిర్మాతల సూచనలను కూడా ఆయన పట్టించుకోడు. తను అనుకున్నది చేసుకుంటూ వెళుతుంటాడు. ఎవరితోను ఫ్రీగా ఉండలేని ఆయన ధోరణి ఆయనకి మైనస్ అయింది" అని చెప్పుకొచ్చారు.

Gottimukkala Padma Rao
Vamsi
April 1 Vidudala Movie
  • Loading...

More Telugu News