Crime News: జగిత్యాలలో కాల్పుల కలకలం.. ఒకరి పరిస్థితి విషమం

  • భార్యపై శ్రీనివాస్ అనే వ్యక్తి కాల్పులు
  • కుటుంబ కలహాలతో దారుణం
  • అడ్డొచ్చిన మేనమామకు తీవ్రగాయాలు

జగిత్యాల జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది. గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన పి.శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగానే కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. తన భార్య గీతిక కొన్ని రోజులుగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇస్రాజ్ పల్లిలోని తన పుట్టింట్లో ఉంటోంది.

మరో వ్యక్తితో కలిసి వచ్చిన శ్రీనివాస్ తన భార్యను హతమార్చబోయాడు. దీంతో మేనమామ రాజిరెడ్డికి బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ దర్యాప్తు ప్రారంభించి, శ్రీనివాస్‌కి ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అతడి వద్ద తుపాకీ, రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గీతికకు ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది.

Crime News
Jagtial District
  • Loading...

More Telugu News