Twitter: రవివర్మ పెయింటింగ్ లకు ప్రతిరూపాలుగా హీరోయిన్ల పోజులు.. ఆ అందాలకు షాక్ అవుతున్న నెటిజన్లు!

- నామ్ ఫౌండేషన్ సెలబ్రిటీ క్యాలండర్ కోసం ఫొటోలు
- రవివర్మ చిత్రాల్లా పోజులు
- వైరల్ అవుతోన్న హీరోయిన్ల ఫొటోలు
హీరోయిన్ సమంతతో పాటు పలువురు హీరోయిన్లు తాజాగా షేర్ చేస్తోన్న తమ ఫొటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రవి వర్మ కుంచే నుండి జాలువారిన అందాల పెయింటిగ్ రూపంలో హీరోయిన్లు ఫొటోలు దిగారు.

అమ్మాయిలు అందంగా ఉంటే 'రవివర్మ వేసిన పెయింటింగ్ లా ఉన్నావు' అంటారు. అచ్చం రవివర్మ వేసిన పెయింటింగ్ లకు ప్రతిరూపంలా హీరోయిన్లు ఫొటోలు దిగారు. తమ ఫొటోలను ఇంత అందంగా తీర్చిదిద్దిన ఫొటోగ్రాఫర్లకు హీరోయిన్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.




