Kosta Andhra: కోస్తాను కమ్మేసిన మబ్బులు... పలు చోట్ల వర్షం!

  • తీరంపై ఉపరితల ఆవర్తనం
  • మరో 24 గంటలు ప్రభావం
  • చాలా ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం

తమిళనాడు నుంచి కోస్తా తీరం మీదుగా, ఒడిశా వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో, గత రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోసర్తు వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లోని కాకినాడ, రాజమండ్రి, రామచంద్రాపురం, భీమవరం, ఏలూరు, కైకలూరు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్గం కురిసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం మరో 24 గంటలు కొనసాగుతుందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు వెల్లడించారు.

Kosta Andhra
Rains
Odisha
Andhra Pradesh
Tamilnadu
  • Loading...

More Telugu News