Prakash Raj: బీజేపీ నేతల్లారా... మీకు సిగ్గుండాలి: ప్రకాశ్ రాజ్

  • ప్రసంగాలకు అంశాలే దొరకలేదా?
  • విద్వేష పూరిత ప్రసంగాలెందుకు?
  • ట్విట్టర్ లో మండిపడిన ప్రకాశ్ రాజ్

ఢిల్లీ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరగనున్న వేళ, నేతల ప్రచార సరళిపై దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "గోలీ, బిర్యానీ, టెర్రరిస్టులు, హేట్ స్పీచ్..." అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడేందుకు ఇంతకన్నా ఎటువంటి అంశాలూ లేవా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు సిగ్గుండాలని నిప్పులు చెరిగారు.

కాగా, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలూ తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. హస్తిన పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతుండగా, తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తిరిగి అధికారాన్ని దగ్గర చేస్తాయని ఆప్ నమ్మకంతో ఉంది. పీపుల్స్ పల్స్ వంటి సర్వే సంస్థలు సైతం సీట్లు కొన్ని తగ్గినా, తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రానుందని అంచనా వేశాయి.

Prakash Raj
BJP
New Delhi
Elections
  • Error fetching data: Network response was not ok

More Telugu News