Jagan: మీ ప్రతాపం వారి మీద చూపించండి: కేశినేని నాని

  • ప్రత్యేక హోదా సాధిస్తామని మీరు ఇచ్చిన హామీ ఏమైంది?
  • మీరు ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు
  • రైతులు, మహిళలపై ప్రతాపం చూపించడం కాదు.. కేంద్రంపై చూపించండి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు. మీరు, మీ 22 మంది ఎంపీలు ప్రత్యేక హోదాను ఎప్పుడు సాధిస్తారో అని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళల మీద ప్రతాపం చూపించడం కాదు... కేంద్రం మీద మీ ప్రతాపం చూపించి ప్రత్యేక హోదాను సాధిస్తే మంచిదని దెప్పి పొడిచారు. దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా లేదు అంటూ లోక్ సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన సమాధానానికి సంబంధించి ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.

Jagan
YSRCP
Kesineni Nani
Telugudesam
Andhra Pradesh
Special Category Status
  • Loading...

More Telugu News