పవన్ సినిమాలో యాంకర్ అనసూయ?
- రంగమ్మత్తగా మంచి క్రేజ్
- క్రిష్ సినిమాలో కీలకమైన పాత్ర
- అభిమానుల్లో కుతూహలం
అంతేకాదు హరీశ్ శంకర్ వినిపించిన ఒక కథకి కూడా ఆయన పచ్చ జెండా ఊపాడు. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాలో ఒక కీలకమైన పాత్రకిగాను యాంకర్ అనసూయను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'రంగస్థలం'లో మాదిరిగా ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో అనసూయ రేంజ్ మారిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బందిపోటు పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనుండగా, ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ పేరు వినిపిస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.