Tanzania: ప్రార్థించిన నూనెను తాకేందుకు ఉరికిన భక్తులు... చర్చిలో తొక్కిసలాటలో 20 మంది మృతి!

  • టాంజానియాలో ప్రత్యేక ప్రార్థనలు
  • మంత్రించిన నూనెను వేదిక ముందు పోసిన పాస్టర్
  • దాన్ని తాకేందుకు ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు
  • ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

టాంజానియాలోని ఓ ఓపెన్ ఎయిర్ చర్చి వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 16 మందికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రముఖ పాస్టర్‌ బోనిఫెస్‌ వాంపోసా ఆధ్వర్యంలో ఓ భారీ బహిరంగ సభ జరుగగా, ప్రార్థించిన నూనెను వేదిక ఎదుట పోసిన తరువాత, భక్తులు ముందుకొచ్చి దానిని తాకాల్సిందిగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ఆ నూనెను తాకితే ఎన్నో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మే భక్తులు, ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడి, తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సరైన ఏర్పాట్లు చేయకుండా తొక్కిసలాటకు కారణమయ్యారని ఆరోపిస్తూ, పాస్టర్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News