Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • డబ్బింగ్ పూర్తి చేసిన రష్మిక 
  • ఆ ప్రచారాన్ని నమ్మకండంటున్న సునీల్ 
  • బైకర్ పాత్రలో యంగ్ హీరో

 *  నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న 'భీష్మ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తాజాగా హీరోయిన్ రష్మిక తన డబ్బింగ్ పూర్తిచేసింది. సినిమా చాలా బాగా వచ్చిందని రష్మిక చెప్పింది.
*  హాస్య నటుడు సునీల్ ఇటీవల అస్వస్థతకు గురవడంతో ఇప్పటికీ ఆయన ఆరోగ్యంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీనిపై తాజాగా సునీల్ స్పందిస్తూ, 'నేను నిక్షేపంలా వున్నాను. నా ఆరోగ్యం గురించి కొందరు మిత్రులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అటువంటి ప్రచారాన్ని నమ్మకండి. నేను షూటింగ్ కోసం ప్రస్తుతం విజయవాడలో వున్నాను' అంటూ పేర్కొన్నాడు.
*  తాజాగా వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన యంగ్ హీరో సుశాంత్  తన తదుపరి చిత్రంలో బైకర్ గా నటిస్తున్నాడు. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' పేరిట రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.  

Rashmika Mandanna
Nithin
Suneel
Sushanth
  • Loading...

More Telugu News