Kona Venkat: నేను పడిన కష్టాన్ని గుర్తించకపోతే బాధపడతాను: కోన వెంకట్

  • ఎవరికైనా కావలసింది గుర్తింపే 
  • డబ్బు గురించి పెద్దగా ఆలోచించను 
  • పదిమంది మెచ్చుకుంటే చాలన్న కోన

రచయితగా కోన వెంకట్ అనేక చిత్రాలకు పనిచేశారు. ఆయన కథలను .. సంభాషణలను అందించిన చిత్రాలలో భారీ విజయాలను సాధించినవి వున్నాయి. అలాంటి కోన వెంకట్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నా కథలో ఇతరులు మార్పులు .. చేర్పులు చెప్పినప్పుడు నేను ఏమీ అనుకోను. ఎందుకంటే మన తప్పులు ఎదుటివారికే తెలుస్తాయి. అందువలన నా కథలో ఎవరో జోక్యం చేసుకున్నారని చెప్పేసి కోప్పడే తత్వం కాదు నాది.

ఎంతో కష్టపడి .. నిద్రాహారాలు మానేసి కథను ఒక కొలిక్కి తీసుకొస్తే, నా కష్టాన్ని గుర్తించనప్పుడు మాత్రం బాధపడతాను. పారితోషికం అనేది తరువాత సంగతి. ఏ మనిషైనా గుర్తింపు కోసమే పని చేస్తాడు. ఆ గుర్తింపు దక్కనప్పుడు బాధ అనిపించడం సహజమే కదా? కోన ఈ సీన్ బాగా రాశాడ్రా .. ఈ డైలాగ్ బాగా రాశాడ్రా అని పదిమంది చెప్పుకుంటే చాలు. ఒక రచయితకి అంతకన్నా ఆనందం ఏముంటుంది?" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News