Nandigam Suresh: నాపై దాడి యత్నం వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారు: ఎంపీ నందిగం సురేశ్ ఆరోపణ

  • రైతులు, జేఏసీ ముసుగులో నాపై దాడికి యత్నించారు
  • భవిష్యత్ లో నాకేమైనా జరిగితే బాబు, లోకేశ్ దే బాధ్యత
  • చంద్రబాబు, లోకేశ్ కు నోటీసులిచ్చి విచారణ జరపాలి

వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై రాజధాని ప్రాంతంలో ఇటీవల దాడి ప్రయత్నం జరిగిన తెలిసిందే. ఈ ఘటనపై సురేశ్ స్పందిస్తూ, రైతులు, జేఏసీ ముసుగులో గూండాలతో తనపై దాడికి యత్నించారని, తనపై దాడి యత్నం వెనుక కచ్చితంగా చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ఆరోపించారు.

భవిష్యత్ లో తనకు ఏమైనా జరిగితే చంద్రబాబు, లోకేశ్ దే బాధ్యత అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ కు నోటీసులిచ్చి విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నట్టు చెప్పారు. లోకేశ్ తన ఎమ్మెల్సీ పదవి పోతుందేమోనన్న భయంలో ఉన్నారని, ఆయనలో అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. రాజధానికి ఇచ్చిన భూములను తిరిగి ఇచ్చేస్తే తీసుకోవద్దని దళితులను చంద్రబాబు భయపెడుతున్నారని ఆరోపించారు.

Nandigam Suresh
YSRCP
Chandrababu
Telugudesam
Nara Lokesh
  • Loading...

More Telugu News