Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో టాలీవుడ్ దర్శకుల సందడి

  • అల.. వైకుంఠపురములో చిత్రం ఘనవిజయం
  • తన నివాసంలో పార్టీ ఇచ్చిన బన్నీ
  • రాఘవేంద్రరావు సహా దర్శకులందరికీ ఆహ్వానం

టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. దాంతో బన్నీ సంతోషం అంతాఇంతా కాదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత సుదీర్ఘవిరామం తీసుకుని నటించిన చిత్రం కావడంతో ఈ విజయానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక అసలు విషయానికొస్తే, అల.. వైకుంఠపురములో చిత్ర విజయాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన నివాసంలో భారీ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి టాలీవుడ్ దర్శకులందరినీ ఆహ్వానించడం విశేషం.

సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి, తమ టాలెంట్ నిరూపించుకుంటున్న యువదర్శకుల వరకు బన్నీ ఇంట్లో అందరూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను బన్నీనే సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. "మా సంబరాల్లో పాలుపంచుకునేందుకు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సమావేశం మాకు ఎల్లప్పటికీ ప్రత్యేకం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికి కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశాడు.

Allu Arjun
Ala Vaikunthapuramulo
Trivikram Srinivas
Tollywood
Direcrtors
Raghavendrarao
  • Loading...

More Telugu News