Kona Venkat: కొన్ని కథలను శ్రీను వైట్ల మాత్రమే డీల్ చేయగలడు: రచయిత కోన వెంకట్

  • శ్రీను వైట్లకి కామెడీపై మంచి పట్టుంది
  • నేను అలా అని వుండకూడదు
  • కంటెంట్ లోపమే పరాజయాలకు కారణమన్న కోన  

శ్రీను వైట్ల .. కోన వెంకట్ కలిసి కొన్ని సినిమాలకి పని చేశారు. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో ఇద్దరూ కలిసి పనిచేయడం మానేశారు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి కోన వెంకట్ స్పందించారు. 'శ్రీను వైట్ల సినిమాల్లో ట్రైన్ కామెడీ .. పార్టీ కామెడీ సీన్లు బాగా పేల్తాయి. ఒక్కో పాత్రకి ఒక్కో మేనరిజం పెట్టేసి కామెడీని రాబట్టడంలో ఆయన సిద్ధహస్తుడు.

కామెడీ సీన్లను ఆయన డిజైన్ చేసే తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ కి కామెడీని కనెక్ట్ చేయడమెలాగో ఆయనకి బాగా తెలుసు. 'రెఢీ' .. 'ఢీ' .. 'దూకుడు' వంటి సినిమాలు హిట్ కావడమే అందుకు నిదర్శనం. 'బ్రూస్ లీ' తరువాత మేము కలుసుకోలేదు. ఆయనతో కలిసి నేను పని చేయను అని ప్రతిజ్ఞ కూడా చేశాను. అలా అనడం కూడా కరెక్ట్ కాదని ఆ తరువాత అనిపించింది. ఆ తరువాత ఆయన సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం కంటెంట్ కరెక్ట్ గా లేకపోవడమే" అని చెప్పుకొచ్చారు.

Kona Venkat
Srinu Vaitla
Dookudu
  • Loading...

More Telugu News