Vijay Sai Reddy: కరోనా నుంచి కాపాడేందుకు బాబు ఏదో ఒకటి చేయకపోతే ఎవరూ మిగలరు!: చంద్రబాబుపై విజయసాయి సెటైర్

  • చైనాలో కరోనా వైరస్ విజృంభణ
  • చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయి
  • చంద్రబాబుకు అతీంద్రియ శక్తులున్నాయని వ్యంగ్యం

ఓవైపు చైనా సహా ప్రపంచదేశాలను ప్రాణాంతక కరోనా వైరస్ పీడిస్తున్న తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రం సంధించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.... తుపానులను నియంత్రించగల అతీంద్రియ శక్తులున్న చంద్రబాబునాయుడి వైపు ప్రపంచమంతా చూస్తోందని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ బారినుంచి కాపాడేందుకు ఆయన ఏదో ఒకటి చేయకపోతే ఈ భూమ్మీద మనుషులెవరూ మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ ఆందోళన చెందుతున్నారని సెటైర్ వేశారు.

  • Loading...

More Telugu News