YSRCP: పల్నాడులో డాక్టరుపై దాడి.. వైసీపీపై ఆరోపణలు!

  • పిడుగురాళ్లకు చెందిన డాక్టరుపై దాడి
  • ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స  
  • ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. పిడుగురాళ్లకు చెందిన డాక్టరు శేఖర్ బాబుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు వెలువడ్డాయి. నిన్న రాత్రంతా శేఖర్ బాబును నిర్బంధించి చిత్ర హింసలు పెట్టి, ఇవాళ ఉదయం రోడ్డు పక్కన పడేసి వెళ్లినట్టు వైసీపీ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డ శేఖర్ బాబును ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి తరఫు వ్యక్తులు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని, ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదు చేశారని సమాచారం.

YSRCP
Palnadu
Piduguralla
Guntur District
  • Loading...

More Telugu News