Kamineni Srinivas: ఈ విషయంపై ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు తప్పకుండా అడుగుతుంది: కామినేని శ్రీనివాస్

  • అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారు
  • అమరావతి నుంచి సచివాలయాన్ని ఎందుకు తరలిస్తున్నారు
  • కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ సర్కారు తెలపాలి 
  • న్యాయస్థానం ఎదుట జగన్ దోషిగా నిలబడక తప్పదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ మరోసారి విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... విశాఖపట్నం ప్రజలు తమ నగరంలోనే రాజధాని కావాలని కోరుకోవడం లేదని అన్నారు.

అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారని, అమరావతి నుంచి సచివాలయాన్ని ఎందుకు తరలిస్తున్నారన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ సర్కారు తెలపాలని కామినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు తప్పకుండా అడుగుతుందని స్పష్టం చేశారు. న్యాయస్థానం ఎదుట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దోషిగా నిలబడక తప్పదని ఆయన తెలిపారు.

Kamineni Srinivas
BJP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News