Uppudi: ఉప్పూడి గ్యాస్ బ్లో అవుట్ బావిని పరిశీలించిన చినరాజప్ప

  • ఉప్పూడి ఓఎన్జీసీ గ్యాస్ రిగ్ వద్ద లీకేజీ
  • సమీప గ్రామాలకు వ్యాపిస్తున్న గ్యాస్!
  • ఓఎన్జీసీయే బాధ్యత వహించాలన్న చినరాజప్ప

తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడి ఓఎన్జీసీ గ్యాస్ రిగ్ వద్ద నిన్నటి నుంచి గ్యాస్ ఎగసిపడుతుండడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గ్యాస్ లీకవడంతో అది ఉప్పూడి పరిసర ప్రాంతాలకు క్రమంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప ఉప్పూడిలో గ్యాస్ బ్లోఅవుట్ అవుతున్న బావిని పరిశీలించారు. గ్యాస్ లీకేజిని వెంటనే నియంత్రించాలని సూచించారు. గ్యాస్ బాధిత కుటుంబాలకు తగిన ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలకు ఓఎన్జీసీయే బాధ్యత వహించాలని చినరాజప్ప స్పష్టం చేశారు.

Uppudi
East Godavari District
Gas Leakage
ONGC
Nimmakayala Chinarajappa
Telugudesam
  • Loading...

More Telugu News