Roja: ఏపీ డీజీపీని కలిసిన ఎమ్మెల్యే రోజా!

  • డీజీపీ కార్యాలయానికి వెళ్లిన రోజా
  • మర్యాదపూర్వక భేటీ!
  • రోజాకు మంత్రి పదవిపై ఊహాగానాలు

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఏపీలో మారిన పరిణామాల నేపథ్యంలో రోజాకు మంత్రిపదవి ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. మండలి రద్దు నేపథ్యంలో, మండలి నుంచి మంత్రిగా పదవులు దక్కించుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామా అనివార్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, రోజా క్యాబినెట్ లో ప్రవేశించడం తథ్యమంటూ ప్రచారం జరుగుతోంది.

Roja
DGP
Gautam Sawang
Andhra Pradesh
Police
YSRCP
  • Loading...

More Telugu News